వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలు, భూకబ్జాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం ఆయన వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి తాండూ రు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, పార్టీ నాయకులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి చేరుకుని స్నేహమెహ్రాకు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టొద్దని వినతి పత్రాన్ని అం దజేశారు.

పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు, భూకబ్జాలు చేసిన వారి పేర్లను పింక్‌బుక్‌లో ఎంట్రీ చేస్తున్నామని.. మరో రెండేండ్లలో రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని..బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందిపెట్టిన వారు ఏ మూలన దాక్కు న్నా బయటికి తీసుకొచ్చి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. అనంతరం తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్ప టి నుంచి రౌడీయిజం, అరాచకం, దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు.
