ఒక ఇంట్లో నలుగురు ఓటర్లు ఉంటే నలుగురికి వేర్వేరు పోలింగ్ కేంద్రాలు.. ఎన్నికలు వచ్చినప్పుడు భర్త ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తే.. భార్య మరో పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలి.

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలోని 23వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలోని ఓటర్ల దుస్థితి. ఈ సమస్య గురించి సంబంధిత ఎన్నికల అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. సాంకేతిక, ఇతరత్రా కారణాలను చూపిస్తూ ఈ సమస్యను అలాగే పెండింగ్లో పెట్టేస్తున్నారు.
