నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలం మచ్చర్ల గ్రామంలో శుక్రవారం అర్థరాత్రి మాజీ ఎంపీపీ పస్కా నరసయ్య కారుకు నిప్పు పెట్టారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలం మచ్చర్ల గ్రామంలో శుక్రవారం అర్థరాత్రి మాజీ ఎంపీపీ పస్కా నరసయ్య కారుకు నిప్పు పెట్టారు. వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
మంటలు అదుపులోకి రాకపోవడంతో కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నిజామాబాద్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
