
చేవెళ్ల పట్నం మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్ & వైద్య కళాశాలలో ఐఎస్–సీపీఎం (IS-CPM) ఆధ్వర్యంలో పీజీ వైద్య విద్యార్థులకు ‘స్వాస్’ (శ్వాస సంబంధిత అత్యవసర చికిత్సలు)పై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలిలో చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు శ్వాసను మెరుగుపరచి ప్రాణాలను కాపాడే అవగాహన, నైపుణ్యాలు, ఆధునిక పరికరాల వినియోగంపై వైద్యులకు సమగ్ర శిక్షణ ఎంతో అవసరం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ నేషనల్ క్రిటికల్ కేర్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గణేశ్యామ్ పాల్గొన్నారు. అలాగే డైరెక్టర్లు చందన రెడ్డి, శివకుమార్ రెడ్డి, బాలసుబ్రమణ్యం, డాక్టర్ శ్వేత, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జోయా రాణి, సూపరింటెండెంట్ రామకృష్ణ రెడ్డి, సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కళాశాల వైద్యులు, పీజీ విద్యార్థులు ఈ శిక్షణా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని శ్వాస సంబంధిత అత్యవసర చికిత్సలపై ప్రాయోగిక అవగాహన పొందారు.
