సంగారెడ్డి జిల్లా పాశమైలారం, పటాన్‌చెరులోని పారిశ్రామికవాడల్లో కోట్లాది రూపాయల విలువైన భూములను హిల్ట్ పాలసీతో అప్పనంగా అమ్ముకునేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు.

గురువారం మాజీ మంత్రి కమలాకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి పాశమైలారం పారిశ్రామికవాడలో పర్యటించారు. ఈ సందర్బంగా ఖాయిలా పడిన పరిశ్రమలను వారు సందర్శించారు. మొదట బీపీఎల్ పరిశ్రమను పరిశీలించారు. ఖాయిలా పడిన బీపీఎల్ పరిశ్రమల గురించి బీఆర్ఎస్ నాయకులు ఆరా తీశారు. అనంతరం అక్కడే ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ(హిల్ట్)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆతర్వాత ఇతర పరిశ్రమలను పరిశీలించారు.
