ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.

సౌదీ అరేబియాలోని మదీనా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో ఫ్లైట్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు విమానాన్ని అహ్మదాబాద్‌కు దారి మళ్లించారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో విమానం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అనంతరం ప్రయాణికులను కిందకి దింపి ఎయిర్‌పోర్టు సిబ్బంది విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
