వరంగల్ జిల్లా సంగెం మండలంలోని వంజరపల్లిలో విచిత్రం చోటుచేసుకుంది. ఈ గ్రామానికి రెండో విడతలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా ఇక్కడ ఎస్టీ జనాభా లేకున్నా సర్పంచ్ పదవితోపాటు మూడు వార్డు స్థానాలు వారికే కేటాయించారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో వరంగల్ జిల్లా సంగెం మండలంలోని వంజరపల్లిలో విచిత్రం చోటుచేసుకుంది. ఈ గ్రామానికి రెండో విడతలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా ఇక్కడ ఎస్టీ జనాభా లేకున్నా సర్పంచ్ పదవితోపాటు మూడు వార్డు స్థానాలు వారికే కేటాయించారు. దీంతో ఈ అంశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియగా సర్పంచ్‌తో పాటు మూడు వార్డులకు కూడా ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు.
