కేసీఆర్ ఫార్మా సిటీకి సేకరించిన 14 వేల ఎకరాలను వాడుకుని ఫ్యూచర్ సిటీ అని మభ్యపెడుతున్నారు అని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి విజయోత్సవాల మొదటి సభ అట్టర్ ప్లాప్ అయ్యిందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. కొడంగల్, నారాయణ్ పేట లిఫ్ట్‌కు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శంకు స్థాపన చేశారు. నిన్న మక్తల్‌లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరోసారి సీఎం శంకుస్థాపన చేశారన్నారు. ఓకే ప్రాజెక్టుకు సీఎం రెండు సార్లు శంకు స్థాపన చేస్తారా ? అని ప్రశ్నించారు.
