స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించుకొని గులాబీ పార్టీ సత్తా చాటాలని చిట్టెం రామ్మో హన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

మాజీ ఎమ్మెల్యే చిట్టెం నివాసంలో మాగనూర్, కృష్ణ మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫు బరిలో నిలిచే అభ్యర్థుల విజయానికి సైనికుల్లా పనిచేయాలని కోరారు. కృష్ణ మండలంలోని 13 పంచాయతీలు, మాగనూరు మండలంలోని 16 పంచాయతీల్లో గులాబీ జెండా రెపరెపలాడేలా కార్యకర్తలు అభ్యర్థి విజయానికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
