ప్రతి నెలా 36 జీబీ డేటాను భారతీయులు సగటున వినియోగిస్తున్నారు

హైదరాబాద్: భారతీయులు సగటున ప్రతి నెలా 36 జీబీ డేటాను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. యాక్టివ్ స్మార్ట్ఫోన్ యూజర్ ఇండియాలో నెలకు 36 జీబీ డేటా వాడుతున్నట్లు ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్టు పేర్కొన్నది. ప్రపంచంలోనే ఇది అత్యధిక వినియోగం అని నివేదికలో చెప్పారు. 2031 నాటికి మొబైల్ డేటా వినియోగం సగటున నెలకు 65 జీబీ వరకు చేరుకునే అవకాశాలు ఉన్నట్లు రిపోర్టులో వెల్లడించారు.
