మండల కేంద్రంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయం లో పవిత్ర కార్తీక మాస శివరాత్రిని పురస్కరించుకొని మంగళవారం స్వామివారికి లక్షబిల్వార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

మండల కేంద్రంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయం లో పవిత్ర కార్తీక మాస శివరాత్రిని పురస్కరించుకొని మంగళవారం స్వామివారికి లక్షబిల్వార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ వాస్తవ్యులు పొన్నాల సందీప్, వింధ్యారాణి, కొంతం నర్సింగ్ రావు, జ్యోతి, జీ.సుభాష్, ఉమారాణిలచే వేద పండితులు పూజలను నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనము, మంటపారాధన, ఏకాదశ రుద్రాభిషేకములు, పూర్ణాభిషేకములు, చండీ, రుద్రహవనములు, స్వామివారి అలంకరణ – లక్షబిల్వార్చన పూర్తి చేశారు
