రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు యజమానులు కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం పత్తి సీజన్ కావడంతో ఖమ్మంజిల్లాలోని ముదిగొండ, నేలకొండపల్లి, బోనకల్, చింతకాని, కూసుమంచి, ఖమ్మంరూరల్ తదితర మండలాల నుంచి రైతులు భారీగా పంటను సీసీఐ కేంద్రాలకు తీసుకొస్తున్నారు

ఖమ్మం జిల్లాలోని ఖమ్మంరూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని జిన్నింగ్ మిల్లుల వద్ద ఏర్పాటు చేసిన భారత పత్తి సంస్థ (సీసీఐ) కేంద్రాలు రెండో రోజు సైతం మూతపడ్డాయి.
జిన్నింగ్ మిల్లుల యజమానులు నిరవధిక సమ్మె చేస్తున్న విషయం విదితమే. దీనిలో భాగంగా గుర్రాలపాడు, పొన్నెకల్ గ్రామాల పరిధిలోని జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్లు, తల్లంపాడు వద్ద గల సాయి బాలాజీ జిన్నింగ్ మిల్లు వద్ద పత్తి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి.
