పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో విషాహారం తిని గొర్రెలు మరణించగా బీఆర్ఎస్ మండల నాయకులు గొర్రెల పెంపకం దారులను పరామర్శించారు. గత రెండు రోజుల నుంచి ఇప్పటికే 36 గొర్రెలు మృతిచెందగా, తాజాగా శనివారం మరో ఆరు గొర్రెలు మరణించగా మూగజీవాల మరణం సంఖ్య 42 కు చేరింద

బీఆర్ఎస్ మండల నాయకులు గొర్రెల పెంపకం దారులను పరామర్శించారు. గత రెండు రోజుల నుంచి ఇప్పటికే 36 గొర్రెలు మృతిచెందగా, తాజాగా శనివారం మరో ఆరు గొర్రెలు మరణించగా మూగజీవాల మరణం సంఖ్య 42 కు చేరింది. దీంతో సమాచారం తెలుసుకున్న పార్టీ నాయకులు గొర్రెల మంద వద్దకు వెళ్లి బాధిత గొర్రెల పెంపకం దారులను పరామర్శించారు. పార్టీ తరఫున అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు భరోసా ఇచ్చారు. అనంతరం ఫోన్ లో రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బాధిత గొర్రెల పెంపకం దారులతో మాట్లాడారు. విషాహారం తిని గొర్రెలు మరణించడం బాధాకరమని ఆయన అన్నారు.
