రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారులు రాజ్యమేలుతున్నారు. అక్కడే యథేచ్ఛగా ధాన్యం తూకం వేసి తరలిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడంతో దళారులు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారులు రాజ్యమేలుతున్నారు. అక్కడే యథేచ్ఛగా ధాన్యం తూకం వేసి తరలిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడంతో దళారులు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఇప్పటికే వరి కోతలు ప్రారంభం కాగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వెల్లువెత్తుతోంది. కేంద్రాలను ప్రారంభించినా, కొనుగోళ్లు చేయడం లేదు. అకాల వర్షాల కురిసే ప్రమాదం ఉన్నందున ధాన్యం తడిసిపోతే అసలుకే మోసం వస్తుందని రైతులు ఆందోళన చెందుతూ తక్కువ ధరకైనా సరే ధాన్యాన్ని అమ్ముకోవడానికి దళారులను ఆశ్రయిస్తున్నారు.
