ఓ వైపు వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు నిబంధనల పేరిట ప్రభుత్వం కొనుగోళ్లలో జాప్యం చేయడంపై ఆగ్రహించారు.

మక్క రైతులు రోడ్డెక్కారు. ఓ వైపు వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు నిబంధనల పేరిట ప్రభుత్వం కొనుగోళ్లలో జాప్యం చేయడంపై ఆగ్రహించారు. మంగళవారం మల్లాపూర్ మార్కెట్‌యార్డు ఎదుట రహదారిపై బైఠాయించి గంటపాటు ధర్నా చేశారు. వెనువెంటనే కొనాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మల్లాపూర్ మండలంలో ఒక్కటే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నదని వాపోయారు.
