
రంగారెడ్డి జిల్లా: (శ్రీరామ్ చక్రీ న్యూస్)
మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్, రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ అందెల శ్రీరాములు గారి తండ్రి అందెల ఆగమయ్య గారు ఇటీవల పరమపదించారు.

ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మరియు అభ్యంతర వ్యవహారాల మంత్రి శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు ఈరోజు శ్రీరాములు గారి నివాసానికి చేరుకుని, ఆగమయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సాంత్వన చెప్పారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ , రాష్ట్ర మరియు జిల్లా బీజేపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్పొరేషన్ బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

