రహదారులపై ప్రజలు అనుభవిస్తున్న నరకాన్ని చూపిస్తూ బీఆర్ఎస్ నాయకులు సదరు రోడ్లపై శుక్రవారం నిరసన తెలిపారు.

ఇల్లెందు : అధ్వానంగా ఉన్న రహదారులపై ప్రజలు అనుభవిస్తున్న నరకాన్ని చూపిస్తూ బీఆర్ఎస్ నాయకులు సదరు రోడ్లపై శుక్రవారం నిరసన తెలిపారు. బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఇచ్చిన డిజిటల్ సెల్ఫీ పిలుపు మేరకు గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ నాయకత్వంలో ఇల్లెందు పట్టణం నుండి ఖమ్మం వెళ్లే రహదారి మధ్యలో పెద్ద పెద్ద గుంతలు పడి రోడ్డు పూర్తిగా పాడై వర్షపు నీటితో ప్రమాదకరంగా మారింది. రహదారి దుస్థితిని చూపిస్తూ గుంతలలో మొక్కలు నాటి నిరసన తెలిపారు.
