ప్రెస్ మీట్ ఉందని తనకు ఎందుకు చెప్పలేదని సిబ్బందిపై ఈవో శీనా నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరే ప్రెస్ మీట్ నిర్వహించుకోండి అంటూ వెళ్లిపోయారు.

విజయవాడ, అక్టోబర్ 11: దుర్గగుడి ఛైర్మన్, పాలక మండలి సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తొలిరోజే ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత నూతన ఛైర్మన్ రాధాకృష్ణ (గాంధీ) మీడియా సమావేశం నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో ఛైర్మన్‌తో సహా కొందరు సభ్యుల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అదే సమయంలో మీడియా సమావేశ ప్రదేశానికి ఈఓ శీనా నాయక్ వచ్చారు. ప్రెస్ మీట్ ఉందని తనకు ఎందుకు చెప్పలేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరే ప్రెస్ మీట్ నిర్వహించుకోండి అంటూ ఈవో వెళ్లిపోయారు.
