బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నట్లు బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు.
హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నట్లు బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. అన్ని బీసీ సంఘాల మద్దతుతో బంద్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అందరూ కలిసి బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. రాజకీయ పార్టీలు, కుల సంఘాలు బంద్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు

