పీఎం ధన్ ధాన్య యోజన అనే పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టి్ట్యూట్లో జరుగనున్న సమావేశంలో రైతులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడనున్నారు
.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశ వ్యాప్తంగా వ్యవసాయ విప్లవం తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని వెనుక బడిన జిల్లాలో వ్యవసాయ స్థిరీకరణ చేసేందుకు, రైతులకు అండగా ఉండేదుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ధన్ ధాన్య యోజన అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీంను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టి్ట్యూట్లో జరుగనున్న సమావేశంలో రైతులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడనున్నారు. వ్యవసాయం చేసేందుకు రైతుల కాన్ఫిడెన్స్ పెంచడమే కాకుండా.. రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటారు.
