రాష్ట్రంలో ఈనెల 16 నుంచి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం అంచనా వేసింది.

రాష్ట్రంలో ఈనెల 16 నుంచి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం అంచనా వేసింది. ఈ రుతుపవనాలపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నెల 3వ వారంలో ప్రవేశించే ఈశాన్య రుతుపవనాలు డిసెంబరు వరకు కొనసాగే అవకాశముందని, వాతావరణంలో ఏర్పడే మార్పులు బట్టి మరో నెల వరకు వీటి ప్రభావం కొనసాగే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.
