మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాలలో ఇవాళ అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది. సుమారు 721 ఏళ్ల తర్వాత శుక్రవారం రోజున భోజ్‌శాల ఆలయంలో మహాహారతి నిర్వహిస్తున్నారు. ధార్ జిల్లాలో ఉన్న ఆ ఆలయంలో ఇన్నాళ్లూ ముస్లింలు నమాజ్ చేశారు.

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాలలో ఇవాళ అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది. సుమారు 721 ఏళ్ల తర్వాత శుక్రవారం రోజున భోజ్‌శాల ఆలయంలో మహాహారతి నిర్వహిస్తున్నారు. ధార్ జిల్లాలో ఉన్న ఆ ఆలయంలో ఇన్నాళ్లూ ముస్లింలు నమాజ్ చేశారు. అయితే ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును ఇచ్చింది. భోజ్‌శాల సరస్వతీ దేవి ఆలయమని కోర్టు తన తీర్పులో వెల్లడించిన విషయం తెలిసిందే.భోజ్‌శాల ఆలయ పరిసరాల్లో సుమారు 1800 మంది బలగాలను మోహరించారు. మే 15వ తేదీన తీర్పు వచ్చిన తర్వాత అక్కడ తొలి శుక్రవారం కావడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
