Riddhi Chauhan: 17 ఏళ్ల భారత సంతతి అమ్మాయి రిద్ది చౌహాన్(Riddhi Chauhan) అమెరికాలో దూసుకెళ్తున్నది. న్యూయార్క్‌లోని తన స్కూల్లో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నది. నేవీ జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్కు ఆమె లీడర్ అయ్యింది.

న్యూఢిల్లీ: భారతీయ సంతతికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి అమెరికాలో దూసుకెళ్తున్నది. న్యూయార్క్‌లోని తన స్కూల్లో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నది. నేవీ జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్కు ఆమె లీడర్ అయ్యింది. ప్రస్తుతం అమెరికా యువతకు ఆమె ఆదర్శంగా నిలుస్తున్నారు. న్యూయార్క్‌లోని బెంజిమన్ కార్డోజో హై స్కూల్‌కు నేవీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ అయ్యారు. ఎన్జేఆర్ఓటీసీ ప్రోగ్రామ్‌లో హయ్యస్ట్ ర్యాంక్ స్టూడెంట్‌గా నిలిచిందామె. ఆ గ్రూపులో ఉన్న సుమారు 300 మంది క్యాడెట్లకు ఆమె నాయకత్వం వహిస్తున్నది.
