ఈనెల 18 న ఖమ్మంలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు సీపీఐ జిల్లా కార్యదర్శి ఖలేక్ అన్నారు. కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మెదక్ రూరల్ జనవరి 16 : పేద ప్రజలకు సీపీఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందనీ, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదేనని సీపీఐ జిల్లా కార్యదర్శి ఖలేక్ అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్ లో బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
