కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో కమిషన్ల పేరిట, నోటీసుల పేరిట, సిట్ పేరిట, విచారణల పేరిట ప్రతిపక్ష నాయకులను రాజకీయంగా వేధించే ప్రయత్నం చేస్తోందన్నారు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్.

మాజీ మంత్రి హరీష్ రావుకు, నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
కేటీఆర్కు సిట్ అధికారుల నోటీసుల నేపథ్యంలో దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో కమిషన్ల పేరిట, నోటీసుల పేరిట, సిట్ పేరిట, విచారణల పేరిట ప్రతిపక్ష నాయకులను రాజకీయంగా వేధించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావుకు, నేడు కేటీఆర్కు నేడు సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపు చర్యలుగానే తెలంగాణ సమాజం భావిస్తోందన్నారు. పాలన చేత కాక ప్రజల తరపున ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను కాంగ్రెస్ సర్కారు టార్గెట్ చేస్తోందన్నారు.
