

మీర్పేట్, జూన్ 17 (శ్రీరామ్ చక్రి న్యూస్): GHMC 60వ డివిజన్ పరిధిలోని సాయి నగర్ స్మశాన వాటికలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం స్మశాన వాటికను పరిశీలించిన నాయకులు అక్కడి పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు.అంత్యక్రియలకు వచ్చే ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేవని తెలిపారు. స్నానాల కోసం ప్రత్యేక గదులు లేకపోవడంతో రోడ్డుపైనే స్నానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మోటార్ చెడిపోయినప్పటికీ మరమ్మతులు చేయకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు.ప్రతి సమస్యకూ స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని నిందించడం సరికాదని, సంబంధిత అధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో కాలనీవాసులతో కలిసి భారీ ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు.కార్యక్రమంలో 60వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేషన్ సభ్యులు మాదారి రమేష్, మాజీ కార్పొరేటర్ ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ అబ్బనమొని గోపి యాదవ్, లప్ప లక్ష్మణ్, ఐతరాజు వెంకటేష్, బెల్లి మల్లేష్ యాదవ్, తమ్మడగోని రాధాకృష్ణ ముదిరాజ్, తొలిసూరి నర్సింహా యాదవ్, వద్ది రజనీకాంత్ ముదిరాజ్, రామకృష్ణ ముదిరాజ్, జక్కల లక్ష్మయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
