స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో చేపల పిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని, తెలంగాణ రాష్ట్రంలో రుచికరమైన చేపలు లభించేలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు 100 శాతం రాయితీతో అందిస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ధర్మసాగర్ రిజర్వాయర్లో సుమారు 12 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు.

మత్స్యకారులు తమ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని, పిల్లలలకు మంచి విద్యాబుద్ధులు చెప్పించాలని సూచించారు. విద్యతోనే మంచి స్థాయికి చేరుకుంటామని అన్నారు. ఈకార్యక్రమంలో
రాష్ట్ర మత్స్య శాఖ చైర్మన్ సాయికుమార్, రాష్ట్ర ముదిరాజ్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్గా బొర్ర జ్ఞానేశ్వర్,రాష్ట్ర క్రీడల ప్రాధికారిక సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, రాష్ట్ర మత్స శాఖ సంచాలకులు
