ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ రైతుల ఆందోళనలు రోజురోజుకు ఉధృతం అవుతున్నాయి.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ రైతుల ఆందోళనలు రోజురోజుకు ఉధృతం అవుతున్నాయి. తాజాగా సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలంటూ ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ నుండి రైతుల ఆందోళన చేపట్టారు. మార్కెట్ యార్డ్ గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పత్తి వాహనాలు మార్కెట్ యార్డులోనికి వెళ్లకుండా రైతులు అడ్డుకున్నారు. రైతుల ఆందోళనతో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి.
