మూడు నెలలుగా విడవని వానలతో రైతన్నలు కుదేలు అవుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంటలను పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. పత్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి.

ఉమ్మడి ఖమ్మంజిల్లాలో కురుస్తున్న వర్షాలు రైతన్నలను ఆగమాగం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంటలను ఎందుకూ పనికిరాకుండా చేస్తున్నాయి. ఇప్పటికే కురిసిన అధిక వర్షాలకు పత్తి పంట పనికిరాకుండా పోయింది. తెగుళ్ల కారణంగా మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. గత ఏడాది అనుకున్న స్థాయిలో వర్షాలు కురవక నష్టపోగా.. ఈ ఏడాది మాత్రం అధిక వర్షాలతో రైతుకు సాగు కలిసిరాలేదు. ప్రస్తుతం సాగు చేసిన ఏ పంట కూడా సరిగ్గా చేతికందక దిగాలు చెందుతున్నారు.
