ఆదివారం రాయపోల్ మండలం వడ్డేపల్లి ఉన్నత పాఠశాలకు మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు సహకారంతో 96 ఇంచుల టీవీతోపాటు సోలార్ ప్లాంటుకు సంబంధించిన పరికరాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ రేణుక మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి ఈ సహకారం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. సోలార్ విద్యుత్ అందడంతో ఇకపై విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండదని, దీంతో విద్యార్థులు డిజిటల్ బోధనను సులభంగా పొందే అవకాశం ఏర్పడిందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధన సాగితే విద్యార్థుల ప్రతిభ మరింత మెరుగవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
