
జనవరి 11( శ్రీరామ్ చక్రిన్ న్యూస్)
లాలగూడలోని తక్షశిలా పబ్లిక్ స్కూల్లో ఔరా తేజోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమలోని దాగి ఉన్న ప్రతిభ, ఆలోచనాశక్తి, సృజనాత్మకతను ప్రదర్శించారు. వివిధ విభాగాల్లో నిర్వహించిన ప్రదర్శనలు, ప్రాజెక్టులు, ప్రెజెంటేషన్లు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ తను ప్రీత్, వైస్ ప్రిన్సిపాల్ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లోని కలలు, నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసానికి ఈ తరహా వేదికలు ఎంతో ఉపయోగపడతాయని, భవిష్యత్తులో విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ముఖ్యంగా విద్యార్థిని సాన్వి గౌడ్ ప్రదర్శించిన మానవ ఆరోగ్యానికి సంబంధించిన కొలెస్ట్రాల్ నియంత్రణపై అవగాహన ప్రాజెక్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంట్లోనే చేయగల సులభమైన చిట్కాలతో కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చని ఆమె వివరించడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ ఔరా తేజోత్సవం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వారి ప్రతిభను గుర్తించే వేదికగా నిలిచిందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
