లంచం అనేది సమాజాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందని, లంచం తీసుకోవడం పెద్ద నేరమని, లంచానికి వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య అన్నారు.

అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఏసీబీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో లంచానికి వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు చౌరస్తా నుండి నిర్వహించిన ఈ ర్యాలీని సీపీ సాయి చైతన్య జెండా ఊపి ప్రారంభించారు.
