మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు గాను అనేక రకాల పోషక పదార్థాలు సహాయం చేస్తాయి. వాటిల్ల ఫైబర్ కూడా ఒకటి. దీన్నే పీచు పదార్థం అని కూడా పిలుస్తారు. ఫైబర్ సాధారణంగా రెండు రకాలుగా ఉంటుంది

ఒకటి సాల్యుబుల్ ఫైబర్ కాగా రెండోది ఇన్ సాల్యుబుల్ ఫైబర్. ఇవి రెండూ మనకు పలు ఆహారాల్లో లభిస్తాయి. సాల్యుబుల్ ఫైబర్ నీటిలో కరుగుతుంది. ఇది పండ్లు, బీన్స్, చిరు ధాన్యాలు, గింజలు, కూరగాయల్లో అధికంగా ఉంటుంది. అలాగే ఇన్ సాల్యుబుల్ ఫైబర్ అంత త్వరగా నీటిలో కరగదు. కాస్త సమయం పడుతుంది. ఈ రకం ఫైబర్ మనకు ఎక్కువగా పండ్లు, గింజలు, కూరగాయలు, తృణ ధాన్యాల ద్వారా లభిస్తుంది. అయితే ఈ రెండు రకాల ఫైబర్లు మనకు ఎంతో మేలు చేస్తాయి. ఫైబర్ ఉండే ఆహారాలను రోజూ తింటుండం వల్ల అనేక లాభాలు.
