ధాన్యం కొనుగోలు, అన్లోడింగ్ ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు.

లోకేశ్వరం, మే 30 : ధాన్యం కొనుగోలు, అన్లోడింగ్ ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని సాథ్గావ్, నగర్ గ్రామాల్లో రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సమీక్షించారు. సాథ్గావ్ గ్రామంలోని శ్రీదుర్గా రైస్ మిల్లులో యంత్రాల సహాయంతో జరుగుతున్న ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు
