తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏబీఎన్ రాధాకృష్ణ వీకెండ్ స్టోరీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ స్టోరీలో రాధాకృష్ణ తనపై ఆరోపణలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.

హైదరాబాద్ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏబీఎన్ రాధాకృష్ణ వీకెండ్ స్టోరీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ స్టోరీలో రాధాకృష్ణ తనపై ఆరోపణలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఈ 40 ఏళ్లలో తాను సమాజం మేలు కోసమే పనిచేశానని చెప్పారు. రాజకీయాల కోసం దిగజారుడు కథనాలు సృష్టించి, ప్రచారం చేసేంత వీక్ క్యారెక్టర్ తనది కాదని అన్నారు.
