అదనపు యూరియా కేంద్రాల పేరుతో కొత్త నాటకానికి తెర లేపిన కాంగ్రెస్ ప్రభుత్వం పై నాగర్ కర్నూల్ జిల్లా రైతులు తిరగబడ్డారు.

కొల్లాపూర్ : అదనపు యూరియా కేంద్రాల పేరుతో కొత్త నాటకానికి తెర లేపిన కాంగ్రెస్ ప్రభుత్వం పై నాగర్ కర్నూల్ జిల్లా రైతులు తిరగబడ్డారు. పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలో రైతు వేదికలో ఏర్పాటుచేసిన యూరియా అదనపు కేంద్రానికి రైతులు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి యూరియా ఇచ్చే ఉద్దేశం ఉంటే సింగిల్ విండో కార్యాలయాల్లోనే యూరియాను రైతులకు తగినంత మొత్తంలో అందజేసి ఉండేదని విమర్శించఆరఉ. అదనపు యూరియా కేంద్రాలలో యూరియా రైతుల డిమాండ్ మేరకు లేకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
