బాధితులు ఇక ఇంటి నుండే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా..

సూర్యాపేట టౌన్, జనవరి 21 : బాధితులు ఇక ఇంటి నుండే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఫోన్ చేస్తే పోలీసులు ఇంటికే వచ్చి పిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసి భరోసా కల్పించడం కోసం సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు. పోలీసు సేవల్లో పారదర్శకత కోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అమలులోకి తెచ్చిన నూతన ప్రణాళిక కార్యాచరణను జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు.
