
ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో సంతోష్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా హనుమాన్ టెంపుల్ మాజీ డైరెక్టర్ మరియు భూపేష్ గుప్తా నగర్ నల్ల పోచమ్మ దేవాలయం చైర్మన్ నారగోన్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ—
ప్రశాంత్ హిల్స్ రోడ్ నం. 6లో మహేష్ కన్నె సామి మహా పడిపూజను శ్రద్ధా భక్తులతో నిర్వహించడం ఆనందకరమని పేర్కొన్నారు. పూజలో పాల్గొన్న స్వాములందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయ్యప్ప స్వామిని పూజించిన వారికి సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయని, ఆయనను స్మరించిన భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు

కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్ గురుస్వామి, రమేష్ యాదవ్, సుమన్ స్వామి, రమణ నాయక్ గురుస్వామి, అనిల్ గురుస్వామి, తదితరులు పాల్గొన్నారు.
