మనువాదపు భావజాలం కారణంగా మహిళలపై రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయని, వాటిని వ్యతిరేకించాలని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి నలిగంటి రత్నమాల అన్నారు.

హనుమకొండ చౌరస్తా, జనవరి 18: మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, అయినప్పటికీ వారిపై దాడులు, దౌర్జన్యాలు తగ్గడం లేదు. మనువాదపు భావజాలం కారణంగా మహిళలపై రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయని, వాటిని వ్యతిరేకించాలని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి నలిగంటి రత్నమాల అన్నారు. హనుమకొండ రాంనగర్లోని ఐద్వా హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఐద్వా 14వ జాతీయ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన ‘మహిళలు సాధికారత అంశం’పై రౌండ్ టేబుల్ సమావేశం ఐద్వా హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎం.రమాదేవి, టి.భవానీ అధ్యక్షతన జరిగింది.
