నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్, వార్డు అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తన్నుకున్నారు.

మహబూబ్నగర్, జనవరి 18 : నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్, వార్డు అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తన్నుకున్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వార్డు అభ్యర్థితోపాటు, మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా తన భార్యకు అవకాశం ఇవ్వాలని ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పార్టీ పెద్ద నాయకుడి దృష్టికి తీసుకువచ్చారు. అయితే పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సదరు నాయకుడు సూచించారు.
