నర్సాపూర్, జనవరి20 : బీఆర్ఎస్ పార్టీ గద్దెల జోలికి వస్తే ఎవరినైనా ఈడ్చి అవతల పాడేస్తామని కాంగ్రెస్ను ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి ఆంధ్రప్రదేశ్లో కలపడానికే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారా? అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలని ప్రసంగించడం దేనికి సంకేతం? బీఆర్ఎస్ను పూర్తిగా లేకుండా చేసి తెలంగాణను ఆంధ్రాలో కలపాలని చూస్తాన్నారా? అని ఆమె ప్రశ్నలు సంధించారు.
