ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే సర్పంచులుగా గెలిపించుకోవాలని బీఆర్ఎస్ క్లస్టర్ ఇన్చార్జీలు కోరారు.

బచ్చన్నపేట : స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే సర్పంచులుగా గెలిపించుకోవాలని బీఆర్ఎస్ క్లస్టర్ ఇన్చార్జీలు కోరారు. శుక్రవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని నక్క వానిగూడెం, ఇటకాలపల్లి, రామచంద్రపురం, గోపాల్ నగర్, చిన్న రామంచర్ల, నారాయణపూర్, వీఎస్ఆర్ నగర్ గ్రామాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలు జరిగాయి.
