లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల్ వారు కొండాపూర్ ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీని బహూకరించారు. పిల్లలకు డిజిటల్ విధానంలో బోధన అందించాలనే లక్ష్యంతో 43 ఇంచుల వన్ ప్లస్ టీవీని లయన్స్ క్లబ్ సభ్యుడు గుండేటి మురళి విజయ్ అందించారు.

గ్రామ సర్పంచ్ యాగండ్ల సంజన శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ అనుమల లక్ష్మి శంకర్, లయన్స్ క్లబ్ జనరల్ సెక్రటరీ గుండేటి గంగాధర్, కోశాధికారి సామల శ్రీహరి, డీసీఎంసీ T.వినోద్, కొండాపూర్ లయన్స్ క్లబ్ సభ్యులు గుండేటి కమలాకర్, అను మల్ల ప్రశాంత్, మరిపెళ్లి శీను, గుండేటి రవి ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు రోజా రాణి, వెంకటేష్ , నరేంద్ర, CRP చంద్ర శేఖర్, విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.
