20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

హైదరాబాద్, నవంబర్ 20 : రాష్ట్ర పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఇప్పటికే టీజీఎల్పీఆర్బీ బోర్డుకి, మంత్రులందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. అయినా ఎటువంటి స్పందన లేదని దుయ్యబట్టారు. నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మించి గొంతు కోసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
