నాగోల్, జనవరి 8 (శ్రీరామ్ చక్రీ న్యూస్):
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సరం నమోదైన పోక్సో (POCSO) కేసులో, నిందితుడికి జిల్లా కోర్టు మూడు సంవత్సరాల కఠిన జైలు శిక్ష రూ.10,000 జరిమానా విధించింది. అదనంగా, బాధిత మైనర్ బాలికకు రూ.1 లక్ష పరిహారం మంజూరు చేయబడింది.
పోలీసుల వివరాల ప్రకారం, నాగోల్ కు చెందిన అడురే సూర్య రమేష్ (అలియాస్ రమేష్), స్థానికంగా ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తూ, హాస్టల్ భవనంలో నివసిస్తున్న మైనర్ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన చేశారు. ఈ ఘటనపై నాగోల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు పూర్తి ఆధారాలతో కోర్టులో దాఖలు చేయబడింది. జిల్లా పోక్సో కోర్టు విచారణలో, నిందితుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ రూ.10,000 జరిమానా విధించింది. కోర్టు తీర్పులో, జరిమానా చెల్లించకపోతే అదనపు శిక్ష తప్పనిసరిగా ఉంటుందని స్పష్టంగా పేర్కొంది.
పోలీసులు, కృష్ణయ్య (ఎల్బీనగర్ ఏసీపీ) సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించినందుకు కోర్టు ప్రశంసించినట్లు అదనంగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎస్. శోభారాణి మరియు పి. సత్యనారాయణ సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో న్యాయం సాధ్యమైందని పేర్కొన్నారు.
అధికారుల ప్రకారం, “పిల్లలపై జరిగే నేరాల విషయంలో చట్టం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ఈ తీర్పు మరోసారి స్పష్టం చేస్తోంది,” అని వారు చెప్పారు.
