పేదలకు డబుల్ బెడ్రూ ఇండ్లు అందని ద్రాక్షలా మారాయి. నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేయడం లేదు.

న్యూశాయంపేట, మే 24 : పేదలకు డబుల్ బెడ్రూ ఇండ్లు అందని ద్రాక్షలా మారాయి. నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. దీంతో వేయి కండ్లతో ఏండ్లుగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతోంది. నగరంలోని పేదలకు పక్కా ఇండ్లు సమకూర్చాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లకు శ్రీకారం చుట్టింది. హనుమకొండ జిల్లా కేంద్రంలోని 31వ డివిజన్ న్యూశాయంపేట రైల్వేట్రాక్ అవతల కేటాయించిన 8 ఎకరాల్లో నిర్మాణం చేపట్టింది.
560 చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని హంగులతో 19 బ్లాకులు, ఒకో బ్లాకులో 32 గృహాలు, మొత్తం 608 మంది నిరుపేదల కోసం ఇండ్లు నిర్మించింది
