ధాన్యం కొనుగోళ్ల వేళ పెద్దపల్లి జిల్లాలో సరికొత్త దందాకు తెరలేచింది. ఇక్కడి పీడీఎస్ బియ్యం తక్కువ ధరకు కొని మహారాష్ట్రకు తరలించి అధిక ధరకు విక్రయిస్తుండగా.. మహారాష్ట్రలో తక్కువ ధరకు వడ్లను కొని ఇక్కడకు తీసుకొచ్చి మద్దతు ధరతో అమ్ముతున్నట్టు వెలుగులోకి వస్తున్నది.

రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి జిల్లాలలోని రేషన్‌షాపులు, లబ్ధిదారుల నుంచి కిలోకు రూ.15 నుంచి రూ.16కు సేకరించి వాటిని లారీల్లో మహారాష్ట్రలోని సిరోంచకు తరలిస్తున్నారు. అలా ఒక్క లారీ రాత్రి వేళలో బయలు దేరి అక్కడ బియ్యాన్ని అన్లోడ్ చేసి కిలోకు రూ.20 నుంచి రూ.22 వరకు విక్రయిస్తున్నారు. ఇలా రోజుకు ఒక లారీ 25 టన్నులతో బియ్యం వెళ్తుండగా, కిలోకు రూ.6 చొప్పున రూ.1.50 లక్షలు అక్రమంగా దండుకుంటున్నారు.
