మంచిర్యాల జిల్లాకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు రానున్నారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో జూన్ 1న సింగరేణి పరిరక్షణ సదస్సు నిర్వహించనున్నారు.

మంచిర్యాల, : మంచిర్యాల జిల్లాకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు రానున్నారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో జూన్ 1న సింగరేణి పరిరక్షణ సదస్సు నిర్వహించనున్నారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై.. సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, సింగరేణి కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, తప్పుడు బొగ్గు నిల్వలు, సింగరేణిపై పడుతున్న ఆర్థిక భారం, మెడికల్ బోర్డు రద్దు చేసేందుకు సర్కారు చేస్తున్న కుట్రలు, కేసీఆర్ హయాంలో ఇచ్చిన డిపెండెంట్ ఉద్యోగాలపై విజిలెన్స్ విచారణ పేరుతో వేధింపులు, సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బాకాయి పడ్డ రూ.54 వేల కోట్లు, మారుపేర్లు, విజిలెన్స్ కేసులు, కార్మికులను అక్రమంగా చేసే డిస్మిస్లు, తదితర అంశాలపై ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణి కార్మికులకు వివరించనున్నారు.
