నిధులు మంజూరు అయినప్పటికీ తూర్పు కోట పరిధిలోని అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఖిలా వరంగల్, జనవరి 22 : తూర్పు కోట పరిధిలోని ముదిరాజ్ వాడ, యాదవ వాడల్లో గత సంవత్సరం జూన్లో శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. నిధులు మంజూరు అయినప్పటికీ పనులు అసంపూర్తిగా ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్, ఎంసిపిఐయూ పార్టీల ఆధ్వర్యంలో నాయకులు 37వ డివిజన్ తూర్పు కోటలో పర్యటించి, పెండింగ్ అభివృద్ధి పనులను పరిశీలించారు. ముదిరాజ్ వాడలోని ముదిరాజ్ కమ్యూనిటీ భవన్ (సంగరాబోయిన ఇంద్రాసేన స్మారక భవన్), సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, మంచినీటి పైప్లైన్ పనులు, అలాగే యాదవ వాడలోని సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్ పనులు పూర్తికాకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు తెలిపారు.
