దేవరకొండ మున్సిపల్ పై మరోసారి గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ హయాంలోనే దేవరకొండలో రూ. 6 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపించారు. పట్టణంలోని మురికి కాలువలు, సీసీ రోడ్డు పనులు, మిషన్ భగీరథ నీరు, స్ట్రీట్లైట్లు పనులు చేశామని వివరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కే ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని పేర్కొన్నారు.
